పల్లెల్లో పార్కుల ఏర్పాటుకు చర్యలు

0 18

– ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ విశ్వనాథం
– అట్టహాసంగా మొక్కల పెంపకం
– కోటి మొక్కల పెంపకమే లక్ష్యం

 

చౌడేపల్లెముచ్చట్లు:

- Advertisement -

గ్రామీణ ప్రాంత పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణంను తలపించడానికి ఉపాధి హామీ నిధులతో పార్కుల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ విశ్వనాథం తెలిపారు. గురువారం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తో కలిసి చౌడేపల్లె మండలంలోని చారాల, దుర్గసముద్రం పంచాయతీలలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అట్టహాసంగా ర్యాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటి వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకొన్నట్లు చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల సూచనలమేరకు పుంగనూరు నియోజకవర్గంలో ఆదర్శంగా రోడ్లకు ఇరువైపులా లక్ష మొక్కలను నాటేందుకు స్వీకారం చుట్టామని, మరో రెండు రోజుల్లో లక్ష మొక్కల పెంపకం నాటే ప్రకియ పూర్తి అవుతోందని తెలిపారు. పల్లెల్లో ఉపాధి నిధుల ద్వారా పార్కులను ఏర్పాటుచేసి పచ్చని వాతావరణం నడుమ ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించడమే ధ్యేయంగా పనిచేయాలని ప్రజాప్రతినిథులు,అధికారులకు సూచించారు.స్థలం ఉండి ఆసక్తిగల పంచాయతీలల్లో పార్కులు ఏర్పాటుచేసి గ్రామాల అభివృద్దికి కొత్తదనం తేవడానికి కృషి చేయాలని సూచించారు. వందశాతం మొక్కలు సంరక్షించిన సర్పంచులు, సిబ్బందికి ప్రోత్సహక బహుతులు అందజేస్తామని ప్రకటించారు.ఈ సమావేశంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మాజీ జెడ్పిటీసీ రుక్మిణమ్మ, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, మాజీ ఎంపీటిసీ పద్మనాభరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి తదితరులున్నారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Measures for setting up of parks in the countryside

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page