పుంగనూరు మెడికల్‌ ఆఫీసర్‌ పై దాడి కేసులో డిఎస్పీ విచారణ

0 145

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వ కమ్యూనిటి ఆసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ చిర్మిలపై నర్సు నాగలక్ష్మి దాడి చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ సెల్‌ డిఎస్పీ విజయశేఖర్‌ గురువారం విచారణ జరిపారు. కాగా ఈనెల 2న విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటు సెల్‌ఫోన్‌లోమాట్లాడుతున్న నాగలక్ష్మి అనే నర్సును మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిల మందలించారు. దీనిపై అగ్రహించిన నర్సు మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసి దుర్భాషలాడారు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు.ఈ మేరకు చిర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై డిఎస్పీ విజయశేఖర్‌ నర్సులను, మెడికల్‌ ఆఫీసర్‌ను విచారించారు. కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నామని , ఇందుకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

Tags: DSP probe into Punganur medical officer assault case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page