భూతగాదాలు… రెండు కుటుంబాల ఘర్షణ

0 14

జగిత్యాల ముచ్చట్లు :

 

జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో భూతగాదాలు, పాత కక్షల కారణంగా ఓ కుటుంబంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు.. అక్కడే ఉన్న స్థానికులు సెల్ఫోన్లో ఈ దృశ్యాలను చిత్రికరించగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి..ఆరె మల్లేశం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గంగారెడ్డి అతని కొడుకులు దాడికి పాల్పడ్డారు.. గంగరెడ్డికి చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు విత్తిన వరి పంటకు గడ్డి మందు కొట్టారు.. దీంతో వరి నారు ఎండిపోయింది.. మల్లేశమే గడ్డి మందు పిచికారి చేశారని కసితో ఈ దాడికి పాల్పడ్డాడు.. తీవ్రంగా గాయపడిన మల్లేశంను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. జగిత్యాల రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Exorcisms … a clash of two families

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page