ముగ్గురు అమ్మాయిలతో అలా బుక్కయ్యాడు

0 20

వరంగల్ ముచ్చట్లు:

 

ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ముగ్గుర్ని ముగ్గులోకి దింపాడు. ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడ్డాడు. అలా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. పెళ్లి పేరుతో శారీరిక సంబంధలు కూడా పెట్టుకున్నాడు. చివరకు ముగ్గుర్నీ కూడా మోసం చేశాడు. ఈ ఘటన మహబూబ్‌బాద్ జిల్లాలో జరిగింది.ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు ముగ్గురు బాలికలతో వ్యవహారాలు నడిపిన బాలుడు(17) ముగ్గుర్నీ కూడా మోసం చేసిన ఘటన జిల్లాలోని గార్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగతెంపులు చేసుకున్నాడు.ఆ తరువాత మరో బాలికతో కూడా ఇలాగే చేశాడు. ఆ బాలిక(14)తో శారీరక సంబంధం పెట్టుకుని, ఇంకో బాలిక(17)ను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక బాలుడి ఇంటికే రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Booked so with three girls

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page