మొక్కల పెంపకం.. మన సామాజిక బాధ్యతేకాదు, వ్యక్తిగత బాధ్యత కూడా

0 14

* జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు
* కడప నగర వనంలో 2021 వన మహోత్సవంలో భాగంగా “జగనన్న పచ్చతోరణం” కార్యక్రమానికి శ్రీకారం

* రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జేసీలు, సబ్ కలెక్టర్, డిఎఫ్ఓ లతో కలిసి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

- Advertisement -

కడప ముచ్చట్లు:

 

మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పాటు.. వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పిలుపునిచ్చారు.
“ఆకుపచ్చని ఆంధ్రావని మన లక్ష్యం” అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 72వ వనమహోత్సవంలో భాగంగా.. గురువారం కడప నగర శివార్లలోని నగర వనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని.. గౌరవ అతిథి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి జిల్లా కలెక్టర్ తో పాటు జేసీలు సాయికాంత్ వర్మ(అభివృద్ధి), ధ్యానచంద్ర (హౌసింగ్), ధర్మ చంద్రారెడ్డి (సంక్షేమం), సబ్ కలెక్టర్ పృద్వితేజ్, డిఆర్వో మాలోల ముఖ్య అతిథులుగా హాజరై.. వారి పేర్లతో కేటాయించిన స్థలంలో అడవి జాతి మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి శ్రీకారం7 చుట్టారు.  అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి తల్లిలాంటిదని, ప్రకృతికి ప్రాణాదారం అయిన చెట్లు ప్రాణికోటికి ప్రాణాదారం అని.. మొక్కల యొక్క విశిష్టతను క్షుణ్ణంగా తెలియజేశారు. పర్యావరణం పరంగా గతంలో జరిగిన నష్టాలను పూరించే దిశగా ఈ తరం యువత సమాజాన్ని పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. ఒక మొక్క నుండి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఒక మొక్కతో సన్నిహితంగా ఉంటే.. దాని ఎదుగుదల మన జీవితానికి కెరీర్ గైడ్ గా ఉపయోగపడుతుందన్నారు. మొక్కలను వ్యక్తిగతంగా అభిమానిస్తూ.. మన ఇంటి పరిసరాల్లో, మనకు చేరువలో పచ్చదనాన్ని ఉంచుకోవాలని యువతను కోరారు. మనం నాటిన మొక్కలను మనమే క్రమం తప్పకుండా సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించాలన్నారు.

 

 

 

రాష్ట్రంలో ప్రస్తుతం 23% ఉన్న పచ్చదనాన్ని… సామాజిక వన మహోత్సవ కార్యక్రమం ద్వారా 33% శాతం అడవులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా.. జిల్లాలో ప్రస్తుతం ఉన్న అడవుల విస్తీర్ణంను 33% నుండి 50% కు పెంచేందుకు కృషి చేయాలన్నారు. అటవీ సంపద పెరిగితే.. వన్య ప్రాణులకు రక్షణ దొరుకుతుందని.. తద్వారా అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలోకి తీసుకు వస్తారని ఆకాంక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘జగమంతా వనం.. ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మందుకు వెళ్తున్నారన్నారు. ప్రతి ఇల్లు, ప్రతీ ఊరూ పచ్చదనంతో సింగారిద్దామంటూ.. పిలుపునిచ్చారు. 72వ వన మహోత్సవం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖతో కలిసి కోట్ల మొక్కలను నాటే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని, అదే స్పూర్తితో …జిల్లాలో ప్రతి ఒక్కరూ.. తమ చుట్టూ వున్న పరిసరాలను పచ్చదనంతో నింపాలన్న ఆయన ఆకాంక్షించారు.
డిఎఫ్ఓ రవీంద్రదామ మాట్లాడుతూ… జిల్లా విస్తీర్ణంలో అడవులు 33% విస్తరించి ఉన్నాయని, అటవీ విస్తీర్ణంలో జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం అడవుల్లో 28.47% ఉన్న పచ్చదనాన్ని 33% శాతంకు పెంచేందుకు సామాజిక అడవుల పెంపకం ద్వారా, గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగస్వామ్యంతో ప్రజలకు ఓ వైపు ఉపాధి కల్పిస్తూనే.. పచ్చదనాన్ని పెంచడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టే వనమహోత్సవం ద్వారా.. జిల్లాలో 5 లక్షలకు మించి  విస్తృతంగా మొక్కలు నాటి.. 33% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50% కు పెంచేందుకు కృషి చేస్తాం అన్నారు.

* *”ఆకుపచ్చని ఆంధ్రావనే మన లక్ష్యం” అని ప్రతిజ్ఞ

అనంతరం 72వ వనమహోత్సవం సందర్బంగా.. జిల్లా అటవీశాఖ వారు.. “ఆకుపచ్చని ఆంధ్రావనే మన లక్ష్యం” అనే నినాదంతో.. పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గాలని గుర్తెరిగి.. ప్రకృతి సమతుల్యతలకు అనుగుణంగా.. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగ పరుస్తాం. వనాలను నరకబోము.. నరకనివ్వము. ప్రతి ఇంటా, ప్రతి ఊరా.. విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తామని.. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య విద్యార్థులతో జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు ప్రతిజ్ఙ చేయించారు.

* *రిమ్స్ వైద్య విద్యార్థులకు కలెక్టర్ కృతజ్ఞతాభివందనలు

కార్యక్రమానికి హాజరైన కోవిడ్ వారియర్స్ అయిన రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులకు.. జిల్లా కలెక్టర్ కృతజ్ఞతాభివందనలు తెలియజేశారు. ప్రజలను రక్షించే బాధ్యతలతో ముడిపడిన వైద్య సిబ్బంది.. మీవంతు వ్యక్తిగత జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచించారు. 3వ దశ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, స్వీయ రక్షణ చర్యలతో పాటు.. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. జనవాసాల్లో క్రమం తప్పకుండా మాస్కు వాడకం ద్వారానే కరోనా వైరస్ ను దూరం చేయవచ్చన్నారు.కార్యక్రమానికి ముందుగా గౌరవ, ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, ప్రార్థనా గీతలాపన గావించగా.. అటవీశాఖ ఉద్యోగ కళాకారులు “చెట్టు మనోభావం”ను వివరిస్తూ.. ఆలపించిన గేయం అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రవీంద్ర దామ, సామాజిక అటవీ విభాగం డీఎఫ్ఓ నాగరాజు, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి, రిమ్స్ ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, తహశీల్దారు శివరామిరెడ్డి, అటవీ అధికారి గంగయ్య యాదవ్, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; Plant breeding is not only our social responsibility but also our personal responsibility

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page