మ‌హిళ శ‌రీరాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా అది రేప్ కింద‌కే…

0 20

– కేర‌ళ హైకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు

 

తిరువ‌నంత‌పురం

 

- Advertisement -

పోక్సో చ‌ట్టం కింద న‌మోదైన‌ ఓ లైంగిక‌దాడి కేసులో కేర‌ళ హైకోర్టు గురువారం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. పురుషాంగంతో మ‌హిళ శ‌రీరాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా అది రేప్ కింద‌కే వ‌స్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే ఓ యువ‌కుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది. ఈ నేప‌థ్యంలో తాను లైంగిక‌దాడికి పాల్ప‌డ‌లేద‌ని, కేవ‌లం పురుషాంగంతో ట‌చ్ చేశాన‌ని, అది ఎలా లైంగిక‌దాడి అవుతుంద‌ని కోర్టుకు అభ్య‌ర్థించాడు. దీనిపై కోర్టు పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత‌.. సెక్ష‌న్ 375 ప్ర‌కారం.. యోని, మూత్ర‌నాళం, పాయువు వ‌ద్ద‌నే కాకుండా.. పురుషాంగాన్ని ఎక్క‌డ ట‌చ్ చేసినా రేప్ చేసిన‌ట్టే అని కోర్టు తెలిపింది. అయితే బాధితురాలి వ‌య‌సును ఆమె త‌ర‌పు న్యాయ‌వాది నిర్ధారించ‌క‌పోవ‌డంతో.. పోక్సో కేసును కోర్టు కొట్టివేసింది. లైంగిక‌దాడికి సంబంధించిన సెక్ష‌న్ల కింద మాత్ర‌మే నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Wherever a woman’s body is touched, it is under rape …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page