రఘురామ వాయిస్.. అలా మారిందే

0 15

న్యూఢిల్లీ    ముచ్చట్లు:
రఘురామ కృష్ణరాజు గెలిచింది వైసీపీ టికెట్ పై ఎంపిగా. అయితే ఇప్పుడు ఆయన వాయిస్ ఆఫ్ టీడీపీ గా పూర్తిగా మారిపోయినట్లే కనిపిస్తుంది. రఘురామ కృష్ణరాజు – చంద్రబాబు – లోకేష్ నడుమ నడిచిన వ్యవహారం సిబిసిఐడి బట్టబయలు చేశాక నరసాపురం ఎంపి రఘురామ కృష్ణరాజు టీడీపీ అధినేత చంద్రబాబు ఏమైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో మక్కి కి మక్కి అవే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.తాజాగా దేవినేని ఉమ అరెస్ట్ వ్యవహారంలో చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణలు రఘురామ కృష్ణరాజు చేసిన విమర్శలు, ఆరోపణలు ఒకేలా ఉండటం గమనిస్తే ఈ క్లారిటీ వచ్చేయకమానదు. దేవినేని ఉమకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనకు రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. అంతేకాకుండా అయితే వీటిని ప్రజలు పరిశీలిస్తారు అన్న విషయం మాత్రం ఇరువురు విస్మరించడం విశేషం.రఘురామ కృష్ణరాజు పై చర్యలు కనీసం పార్టీ పరంగా తీసుకోవడానికి ఇంకా మీనమేషాలు వైసీపీ లెక్కించడాన్ని సొంత నేతలు సైతం తప్పుపడుతున్నారు. దీనివల్ల పార్టీ క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పదవుల్లో ఉండేవారు ముఖ్యంగా ఎంపీలు లు వంటి కీలక పదవుల్లో ఉండే వారు పార్టీ లో ఉంటూ విమర్శలు చేసినా అధిష్టానం ఏమీ చేయలేదన్న సందేశం కిందస్థాయికి చేరడం వల్ల అంతర్గత క్రమశిక్షణ గతి తప్పుతుందన్నది వైసిపి లో టాక్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు సొంత ఎమ్యెల్యేలు, ఎంపీలు గోడదూకినా అధికారంలో లేనందువల్ల ఏమి చేయలేకపోయామని ఇప్పుడు పవర్ లో ఉన్నా ఏమి చేయలేకపోతున్నామన్న ఆవేదన క్యాడర్ లో నెలకొంది. ఇప్పటికి ఇప్పుడు దీనిపై ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరిన్ని వస్తాయన్నది ఫ్యాన్ పార్టీ లో అంతర్మధనం. మరి రఘురామ కృష్ణరాజు వ్యవహారానికి జగన్ ఎప్పటికి చెక్ పెడతారో వేచి చూడాలి..

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Raghuram’s voice .. so changed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page