రాష్ట్రంలో జగనన్న హరితవనాలు – ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ విశ్వనాథ్‌

0 33

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న పచ్చతోరణం క్రింద కోట్లాది మొక్కలు నాటడం జరుగుతోందని , రాష్ట్రంలో జగనన్న హరితవనాలు ఏర్పడుతోందని ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ అన్నారు. గురువారం జగనన్న పచ్చతోరణం క్రింద చదళ్ల గ్రామంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏపిడి చందన తో కలసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటుతున్నామన్నారు. మొత్తం 250 కిలో మీటర్లలో నేరేడు, కానుగ, రావి, మర్రి, వేప, మద్ది, పోనోకార్పస్‌, ఎర్రతురాయి మొక్కలు ఖరీదు రూ.235 లు, వెయ్యి మొక్కలు నాటి రెండు సంవత్సరాలు సంరక్షిస్తే రూ.5 లక్షలు ఉపాధిహామి నుంచి పంచాయతీలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ విధంగా మంత్రి ప్రణాళికలు సిద్దం చేసి , చేపట్టడం జరిగిందన్నారు. ఈ విధంగా కోట్లాది మొక్కలు నెల రోజుల్లో నాటడం జరుగుతుందన్నారు. ఈ బాధ్యతలను ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులకు కేటాయించడం జరుగుతోందన్నారు. పచ్చతోరణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరి, ఏపివో శ్రీనివాసులు, సర్పంచ్‌ గౌరమ్మ , పార్టీ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

 

Tags; Jagannath Greens in the State – NREGS State Councilor Viswanath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page