రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం పదవి స్వీకారం

0 106

విజయవాడ ముచ్చట్లు:

 

రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌గా పుంగనూరుకు చెందిన కొండవీటి నాగభూషణం గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా నాగభూషణం, కాంతమ్మ దంపతులను అభినందించారు. నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపిమిధున్‌రెడ్డి లు తనపై నమ్మకంతో పదవిని ఇప్పించారని జానపద కళాకారులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, రెడ్డెప్ప, సుబ్రమణ్యయాదవ్‌, చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, నరసింహులు, జెపి యాదవ్‌, నటరాజ, తుంగా మంజునాథ్‌, ఖాదర్‌బాషాతో పాటు పార్టీ నాయకులు ఎంఎస్‌.సలీం , రాజేష్‌, సురేష్‌, కుమార్‌, మురళి, పెద్దిరెడ్డి యువజన సంఘ అధ్యక్షుడు కొండవీటి నరేష్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Inauguration of Nagbhushanam, Chairman, State Folk Arts Institute

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page