రూ.60 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం

0 22

విశాఖపట్నం ముచ్చట్లు:
సీలేరు జన్కో తనిఖీ కేంద్రం వద్ద గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా  ధారకొండ నుంచి వస్తున్న లారీ నుపోలీసులు అనుమానం వచ్చి నిలుపుదల చేశారు. లారీను తనిఖీచేయగా ప్యాకింగ్ చేసిన గంజాయి లభించింది. వీటిని తూకంగా వేయగా 400 కిలోలు ఉంది.  ధారకొండలో గంజాయిని కొనుగోలు  చేసి తెలంగాణా రాష్ట్రం తీసుకెళుతున్నట్లు నిందితులు వెల్లడించారు. లారీ లో ఇద్దరు నిందితులను  అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5600 నగదు, రెండు చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ రంజిత్ తెలిపారు.నిందితులు రాజస్థాన్ కు చెందినవారని, వీరి వద్ద నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఎస్. ఐ తెలిపారు.  పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 60 నుంచి రూ. 70 లక్షలు ఉండవచ్చునని అంచనా వేశారు. గూడెం కొత్తవీధి సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఎస్ ఐ రంజిత్ కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Seizure of cannabis worth Rs 60 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page