వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన కాకాణి

0 13

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో “వనమహోత్సవం” లో భాగంగా వైకాపా జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి మొక్కలు నాటారు.మనుబోలు మండలంలో గ్రామాల వారీగా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించవలసినదిగా  ఎమ్మెల్యే కాకాణి కోరారు.దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పేదలు నివసించే ఇళ్ల స్థలాలకు గృహ నివేశన ధ్రువీకరణ పత్రాలు(పొజిషన్ సర్టిఫికెట్లు) పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలతో పాటు, సామాజిక కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడుతున్నారు.వనమహోత్సవంలో భాగంగా జగనన్న పచ్చతోరణం పేరిట విస్తృతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మండలానికి ఒకరోజు ప్రజల రెవిన్యూ సమస్యలపై సమీక్షలు జరిపి, సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాల వారీగా, వారానికోరోజు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రెవిన్యూ సమీక్షలు సత్ఫలితాలిస్తున్నాయి అని అన్నారు. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు అధికారుల కదలికలతో పరిష్కారానికి నోచుకుంటున్నాయి అని తెలిపారు.దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు లేక ఇబ్బందులు పడుతుండటంతో వారికి గృహ నివేశన ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నాం అని తెలియజేశారు.

 

 

 

- Advertisement -

ప్రజలకు అవసరమైన సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతి కల్పించడంతో పాటు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.సోమశిల జలాశయం ద్వారా కండలేరు జలాశయంకి నీరు తరలించే వరద కాలువను 11 వేల క్యూసెక్కుల నుండి 25 వేల క్యూసెక్కులకు ఇస్తున్నామని చెప్పారు.తెలంగాణ రాష్ట్రం రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను దుర్మార్గంగా అడ్డుకుంటుంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం దుర్మార్గం అని అన్నారు.సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ కొలను పథకం కింద మండలానికి ఒక చెరువును ఎంపిక చేసి, సుమారు 7 కోట్ల రూపాయలతో చెరువుల మరమ్మతులు చేపడుతున్నాం అని తెలిపారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Kakani planted as part of the forest festival

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page