వరదలో ఇరుక్కుపోయిన మంత్రి

0 15

భోపాల్ ముచ్చట్లు :

 

వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చిన ఓ మంత్రి ఇరుక్కుపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టరు ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేయాల్సి వచ్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దటియా జిల్లాలో జరిగింది. వరదలతో అల్లాడుతున్న దటియా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా పడవలో వచ్చారు. కోట్రా గ్రామంలో ఓ చెట్టు విరిగి నరో్త్తం మిశ్రా ఉన్న పడవపై పడింది. పడవ మోటారు దెబ్బతిని పనిచేయలేదు. దీంతో మంత్రి నరోత్తం మిశ్రా ప్రభుత్వ అధికారులకు తమను రక్షించమని సందేశాలు పంపించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టరు వచ్చి తాడును కిందకు వదిలి మంత్రి మిశ్రాను సురక్షితంగా పైకి లాగారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Minister trapped in the flood

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page