విరిగిపోయిన పులిచింతల హైడ్రాలిక్ గడ్డర్‌

0 18

ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం
అమరావతిముచ్చట్లు:

 

 

పులిచింతల హైడ్రాలిక్ గడ్డర్‌ విరిగిపోయింది. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 16వ నంబర్‌ గేట్ వద్ద సాంకేతిక సమస్యను పరిశీలించారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్‌ విరిగిపోయిందని మంత్రి అనిల్‌ తెలిపారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో 16వ నంబర్‌ గేట్‌ ఊడిపోయిందని వివరించారు. ఇప్పటికే ఇద్దరుప్రాజెక్టు ఇంజనీర్లు, నిపుణులు పరిశీలించారని, మరో రెండు ఇంజనీరింగ్ నిపుణుల బృందాల్ని పిలిపించామని తెలిపారు. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నామని మంత్రి అనిల్‌ తెలిపారు.యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.
సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు
సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Hydraulic gutter for broken pulses

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page