వేగవంతంగా ఈ క్రాపింగ్ నమోదు

0 48

రామసముద్రం ముచ్చట్లు:

 

మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీలో హార్టికల్చర్ అసిస్టెంట్ బత్తెమ్మ రైతులకు ఈ క్రాపింగ్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ పరిధిలో రైతులకు అందించే పథకాల కోసం ప్రభుత్వం యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌(యూడీపీ) యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న యాప్‌లన్ని కూడా ఇందులోనే ఉంటాయి. రైతు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సాగు చేసిన పంట రకం, విస్తీర్ణం, సర్వే నంబరు, ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం వివరాలతో నమోదు(రిజిస్ట్రేషన్‌) చేసుకోవాలి. కొత్తగా వచ్చిన యాప్‌ ఆధారంగా ఆర్బీకే పరిధిలోని భూమిని జియో ఫెన్సింగ్‌ చేసుకుని ఉన్నందున రైతు నమోదు చేసుకోగానే ఆ భూమి వివరాలు అంతర్జాలంలో చూస్తే కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వం అమలుచేసే ప్రతి పథకం ఈ క్రాప్ పైనే ఆధారపడి ఉంటుంది. పంటల బీమా మంజూరైతే ముందుగా రైతు ఈ క్రాప్ చేయించారా? లేదా? అని చూస్తారు. చేయించకుంటే ఆ రైతును పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ పంట రుణాలు, మద్దతు ధరతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు అనర్హులవుతారు. రైతుకు నష్టం జరగరాదనే ఉద్దేశంతో కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. సాగు చేసిన పంట ఈ క్రాప్ అయిందా… లేదా అని చూసుకునే అవకాశం కల్పించారు. సచివాలయ పరిధిలో పని చేస్తున్న వాలింటర్లు అందరూ రైతులకు ఈ క్రాప్ నమోదుపై అవగాహన కల్పించి వేగవంతం కావడానికి కృషి చేస్తున్నారు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Register this cropping fast

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page