సెప్టెంబర్‌ 1న ఏపీ పాలిసెట్‌-2021 పరీక్ష

0 22

అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష (ఏపీ పాలిసెట్‌-2021)ను సెప్టెంబర్‌ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 380 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్‌ దృష్ట్యా అవసరమైతే దరఖాస్తు గడువును పొడిగిస్తామని అన్నారు. ఇప్పటివరకు 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 72 వేల సీట్లు అందుబాటులో ఉన్నట్లు పోలా భాస్కర్‌ స్పష్టం చేశారు. 84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ-ఆఫీస్‌ సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:AP Polyset-2021 exam on September 1

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page