హాకీలో ఇండియా ధర్డ్.. పొజిషన్

0 17

టోక్యో ముచ్చట్లు:

 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మెన్స్‌ హాకీ జట్టు సంచలన విజయం సాధించడం పట్ల దేశ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా హాకీ జట్టుపై అభినందనలు కురిపించారు. నేరుగా జట్టు కెప్టెన్‌ మన్‌ ప్రీత్‌సింగ్‌కు నేరుగా ఫోన్‌ చేశారు. ఈ సమయంలోనే టీమ్‌ కోచ్‌ కూడా అక్కడే ఉన్నారు.మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ప్రధాని మోదీ కెప్టెన్ మ‌న్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ చేసి చాలా అద్భుతంగా ఆడారంటూ అభినందించారు. దానికి బధులుగా మ‌న్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘మీ దీవెన‌లే మ‌మ్మల్ని గెలిపించాయి’ అని తెలిపారు. సెమీస్ త‌ర్వాత కూడా మోదీ ఫోన్ చేశారని..ఆ విష‌యాన్ని మ‌న్‌ప్రీత్ గుర్తు చేస్తూ..మీరు ఇచ్చిన స్ఫూర్తి ప‌నిచేసింద‌న్నారు. మరోవైపు హాకీ టీమ్ సభ్యులు అద్భుత విజయం సాధించారంటూ భారత జట్టుకు అభినందనలు అని అమరీందర్ ట్వీట్ చేశారు. హాకీ టీమ్‌కు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కాంస్య పతకం సాధించిన జట్టుపై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. హాకీ జట్టులో ఉన్న పంజాబ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రకటించారు. కాంస్య పతకం సాధించడంలో భాగమైన ప్రతి పంజాబీ క్రీడాకారుడికి కోటి రూపాయల నగదు పురష్కారాన్నిస్తున్నామని ప్రకటించారు. ఇక భారత పురుషుల హాకీ జట్టులో పంజాబ్ నుంచి కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఉత్కంఠభరితంగా నువ్వా..నేనా అన్నట్లు  సాగిన మ్యాచ్‌లో జర్మనీపై భారత్‌ 5-4తేడాతో విజయం సాధించింది. 1980లో మాస్కోలో జరిగిన పోటీల్లో హాకీలో భారతదేశం ఒలింపిక్ పతకాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి కాంస్యాన్ని సాధించింది భారత జట్టు.

- Advertisement -

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags; India Third in Hockey .. Position

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page