16 నుంచి పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోకి భక్తులకు అనుమతి

0 8

భువనేశ్వర్‌ ముచ్చట్లు:

ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి భక్తులకు అనుమతివ్వనున్నారు. వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో భక్తులకు దర్శనాలకు అనుమతి నిలిపివేశారు. 16 నుంచి స్థానిక భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వగా.. ఈ నెల 23 నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారికి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం తప్పనిసరిగా 96 రోజులకు మించి దాటకుండా.. తీసుకున్న ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిప్టోర్‌ సమర్పించాలని, రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అడ్మినిస్ట్రేటర్‌ క్రిషన్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అనుమతి ఉంటుందని.. శని, ఆదివారాల్లో ఆలయం మూసే ఉంటుందన్నారు. ఇటీవల ఒడిశా ప్రభుత్వ మత ప్రదేశాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లా పరిపాలన సమావేశమై ఆలయంలో భక్తుల ప్రవేశంపై చర్చించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. అయితే, కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సూచించారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Devotees are allowed to enter the Puri Jagannath Swamy Temple from 16 onwards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page