20న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

0 10

-వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం

-ఆన్‌లైన్‌లో అందుబాటులో టికెట్లు

 

- Advertisement -

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న వరలక్ష్మీ వ్రతం ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో టిటిడి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్ల‌ను టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిస్తారు. ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింత‌లు, కంక‌ణాలు, డ‌జ‌ను గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. పోస్ట‌ల్ ఛార్జీతో క‌లిపి ఈ సేవా టికెట్ ధ‌ర‌ను రూ.1001/-గా నిర్ణ‌యించారు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వ‌ర్చువ‌ల్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

Tags: Varalakshmi vratham on 20th at Thiruchanur Sri Padmavati Ammavari temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page