ఆగస్టు 9న క్విట్ ఇండియా స్ఫూర్తితో

0 11

సేవ్ భారత్ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని విజ్ఞేఫ్తీ
వాల్ పోస్టర్లు విడుదల

కడప ముచ్చట్లు :

- Advertisement -

కడపజిల్లాబ్రిటిష్ పరాయి పాలన వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఆనాడు పిలుపిచ్చారని,నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్వదేశీ ముసుగులో విదేశీ సంస్థలుకు కార్మిక హక్కులు తాకట్టు పెడుతూ, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తు దేశ సంపద  పరిరక్షించుకునే విధముగా ఆగస్టు 9న దేశ వ్యాప్తంగా ఆందోళన లో బాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన జయప్రదం చేయాలని రైల్వే గూడ్స్ షేడ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటీయుసీ అధ్యక్ష,కార్యదర్శి కేసి బాదుల్లా, ఎస్. మహబూబ్ భాష లు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం రైల్వే స్టేషన్ ఆవరణలో వాల్ పోస్టర్లు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతుందని ప్రజలపై అధిక భారాలు వేస్తూ పెట్రోల్ ,డీజిల్ ధరలు  విపరీతంగా పెంచి వేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బ్రిటిష్ కాలంలోనే లక్షలాది మంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్న 44 చట్టాలను సవవరించి 4 కోడ్ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించడం కార్మికుల హక్కులను హరించడమేనని ఆవేదన వ్యక్తంచేశారు.బి.జె.పి రెండవ సారి అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రవేట్ కార్పొరేట్ శక్తులకు ఆదాని, అంబానీ లకు అప్పజెప్పి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను హరించే ప్రయత్ననాలు మానుకోకపోతే గత ప్రభుత్వాలకు పడిన గతే పడుతుందిని చరిత్ర గుర్తేరిగి విధానాలు తీసుకోవాలని హితవుపలికారు.ఈ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ షేడ్ హమాలి యూనియన్ నాయకుల పాల్,మాబు, గంగరాజు, సుబ్బరామ్ లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Inspired by Quit India on August 9th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page