ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

0 3

దేవనకొండ   ముచ్చట్లు :

ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఆశా వర్కర్ల కు  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునిస్వామి లు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మంగళవారం  ఏపీ ఆశ వర్కర్స్  యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఏఐటీయూసీ మండల గౌరవాధ్యక్షులు ఎమ్.నరసరావు అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ… ఆశా కార్యకర్తలను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని అన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఒక్క వేల రూపాయలు నిర్ణయించి పిఎఫ్ మరియు ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. ఆశ వర్కర్లను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని అన్నారు. అలాగే అర్హత కలిగిన ఆశాలను ఏఎన్ఎం లు గా ప్రమోషన్ కల్పించాలన్నారు. కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5,00,000/-  పెన్షన్ 5,000/- ఇవ్వాలన్నారు. ఆశలకు కరోనా సేవలందించినందుకు గాను వెయ్యి రూపాయలు, పెండింగ్లో ఉన్న ఆరు నెలల ఇన్సెంటివ్ ఆరు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే కరోనాతో మరణించిన ఆశాలకు రూ50 లక్షల రూపాయల బీమా మొత్తం చెల్లించాలన్నారు.అలాగే వైయస్సార్ చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వితంతుపెన్షను, ఒంటరి మహిళ పెన్షన్ తదితర పథకాలు వర్తింపు చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే 10 వ తేదీ ఛలో డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేయాలని,17వ తేదీ న ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల సీనియర్ నాయకులు పి.ప్రసాద్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి యం. వెంకటేశ్వర్లు,ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష,కార్యదర్శులు రాధమ్మ,తులసమ్మ, ఆశా కార్యకర్తలు నాగవేణి,విజయలక్ష్మి, పద్మావతి,అమ్మీద, అనిత,కృష్ణవేణి, రాధిక, సుజాత, సుంకలమ్మ,నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Government welfare schemes should be applied to Asha workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page