ఇక ధ్యాన్ చంద్ర ఖేల్ రత్న అవార్డు

0 12

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

ప్రధాని న‌రేంద్ర మోడి మరో కీల‌క నిర్ణయం తీసుకున్నారు. క్రీడ‌ల్లో ప్రతిభ కనబర్చిన వారికి అందించే అత్యున్నత పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ పురస్కారాన్ని మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాల‌ని త‌న‌కు దేశ‌వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక విన‌తులు వచ్చాయని, అందుకే పేరు మార్చాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ ట్విట‌ర్‌లో వెల్లడించారు.అభిమానుల వాళ్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌ర‌త్న అవార్డు పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రక‌టించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జ‌యంతి అయిన ఆగ‌స్ట్ 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ క్రీడా అత్యున్నత పుర‌స్కారం కూడా ధ్యాన్‌చంద్ పేరుతోనే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: The Dhyan Chandra Khel Ratna Award

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page