ఎక్సైజ్ పోలీసుల ఘాతుకం

0 11

గుంటూరు ముచ్చట్లు :

 

గుంటూరు జిల్లా దాచేపల్లి ఎక్సైజ్ పోలీసుల దాడి కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. మిరియాల శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. గత రాత్రి మిరియాల శ్రీకాంత్‌ను ఎక్సైజ్ పోలీసులు జైలుకు పంపారు. నిన్న భట్రుపాలెం వద్ద యువకులపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన షేక్‌ అలీబాషా మృతి చెందాడు. మరో ముగ్గురు యువకులపై హత్యయత్నం కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు.దాచేపల్లికి చెందిన షేక్‌ అలిభాషా, శ్రీకాంత్‌ అనే యువకులు భట్రుపాలెం నుంచి కారులో మద్యం తెస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. భట్రుపాలెం వద్ద వారిని అడ్డుకున్న సిబ్బంది మద్యం ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో మద్యం తమ వద్ద లేదని చెప్పినా వినకుండా ఎక్సైజ్‌ సిబ్బంది తీవ్రంగా గాయపరిచారని అలీబాషా అనే యుకుడు మనస్థాపంతో పురుగు మందు తాగాడు. భట్రుపాలెం గ్రామంలో అలిబాషా పురుగుల మందు తాగాడన్న సమాచారంతో కుటుంబసభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకుని ఎక్సైజ్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం లభించకపోయినా, దాడి చేయటమేమిటంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎస్‌ఐ రహంతుల్లా పురుగుమందు తాగిన యువకుడ్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు మాట్లాడుతూ తమ పిల్లల వద్ద మద్యం లేదన్నా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టారని ఆరోపించారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Excise police assassination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page