ఎస్వీబీసీలో అన్న‌మయ్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం

0 11

-సామాన్యుల ద‌రి చేరేలా వేదం – జీవ‌న‌నాదం కార్య‌క్ర‌మం

-టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

 

- Advertisement -

తిరుప‌తి ముచ్చట్లు :

 

 

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా అన్న‌మాచార్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. అలాగే, సామాన్యుల‌కు సైతం అర్థ‌మ‌య్యేరీతిలో వారానికి రెండు రోజులు వేదం-జీవ‌న‌నాదం కార్య‌క్ర‌మం ప్రైమ్‌టైమ్‌లో ప్ర‌సారం చేయాల‌ని ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శుక్ర‌వారం సాయంత్రం ఎస్వీబీసీ కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించాల‌న్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లపై పోటీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. తొలుత జిల్లాస్థాయిలో, ఆ త‌రువాత రాష్ట్ర‌స్థాయిలో యువ‌త‌కు పోటీలు నిర్వ‌హించాల‌న్నారు. హైద‌రాబాద్‌, తిరుప‌తిలోని ఎస్వీబీసీ స్టూడియోల్లో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని కోరారు. టిటిడి రికార్డు చేసిన 4 వేల సంకీర్త‌న‌ల నుంచే ఈ పోటీలు నిర్వ‌హించ‌డం ద్వారా యువ‌త‌ను ఆక‌ర్షితుల‌ను చేయ‌వ‌చ్చ‌న్నారు. వేదాలు సామాన్య మాన‌వుని జీవ‌న విధానానికి అవ‌స‌ర‌మైన గ‌ణితం, ప‌శుపోష‌ణ‌, వ్య‌వ‌సాయం లాంటి అనేక వైజ్ఞానిక అంశాల‌ను తెలియ‌జేశాయ‌న్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వేదం – జీవ‌న‌నాదం కార్య‌క్ర‌మం వారానికి రెండు రోజులు రాత్రిపూట ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం చేసేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌న్నారు.తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధంపై భ‌క్తుల‌కు పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రూపొందించిన జింగిల్స్‌ను ఎస్వీబీసీలో విస్తృత ప్ర‌చారం చేయాల‌న్నారు.ఎస్వీబీసీ ఛైర్మ‌న్   సాయికృష్ణ యాచేంద్ర‌, టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి   ఎవి.ధ‌ర్మారెడ్డి, వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, ఎస్వీబీసీ సిఈవో సురేష్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Extensive publicity for Annamayya Sankirtana on SVBC

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page