ఒకే పరీక్షతో ఏడు వర్శిటీల్లోకి ఎంట్రీ

0 16

హైదరాబాద్, ముచ్చట్లు :

 


దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. దీనితోపాటు రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్‌ యూనివర్సిటీలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ ఏడు యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీజీఈటీ)–2021కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
కోర్సులు
► సీపీజీఈటీ2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ ప్రవేశం లభిస్తుంది.  

► ఈ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగంలో..పలు ఎంఏ కోర్సులు, జర్నలిజం /లైబ్రరీ సైన్స్‌/సోషల్‌ వెల్ఫేర్‌/ డెవలప్‌మెం ట్‌ స్టడీస్‌ /హెచ్‌ఆర్‌ఎం/టూరిజం మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందొచ్చు.

► ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగంలో.. పురాతన భారతీయ చరిత్ర–సంస్కృతి,  పురావస్తు శాస్త్రం(ఏఐహెచ్‌సీఏ), హిందీ, ఇస్లామిక్‌ స్టడీస్, పర్షియన్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ సబ్జెక్టులు, థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులు ఉన్నాయి.

► ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌లో.. ఎంకామ్, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌లో ఎంఈడీ, ఎంపీఈడీ;

► ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ విభాగంలో.. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రాని క్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ఫోరెన్సిక్‌ సైన్స్‌/ మైక్రోబయాలజీ/ జెనెటి క్స్, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ వంటి సబ్జెక్టులు ఉన్నాయి.

అర్హతలు
► సీపీజీఈటీ–2021కు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌(బీఏ/బీకామ్‌/బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
 
► బీఏ/బీఎస్సీ/బీకామ్‌/బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ ఎల్‌ఎల్‌బీ(ఐదేళ్లు)/బీసీఏ వంటి కోర్సులు చదివినవారు ఏయే కోర్సులకు తమ విద్యార్హతలు సరిపోతాయో దరఖాస్తు చేసుకునే ముందు సరిచూసుకోవాలి.
     
► ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులైన ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ కోర్సులకు ఇంటర్మీడియట్‌ (10+2) పూర్తి చేసినవారు అర్హులు. ∙పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్‌ (ఆయా కోర్సులను బట్టి) పూర్తిచేసి ఉండాలి.

► ఓపెన్‌/దూర విద్య విధానంలో ఒకే సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్‌ కోర్సు పూర్తి చేసినవారు పీజీ కోర్సులకు అర్హులు కారు.

► బీకామ్‌ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్‌ చేసేందుకు అనర్హులు. ∙ఎంఏ లాంగ్వేజెస్‌ కోర్సులకు బీఈ/బీటెక్‌ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు.

► బీఎస్సీ(ఎంఎల్‌టీ)/బీఎస్సీ(నర్సింగ్‌)/బీఎస్సీ (అగ్రికల్చర్‌)/బీఫార్మసీ/బీఎస్సీ(హోమ్‌సైన్స్‌) /బీటెక్‌/బీఈ వారు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు.
 
► బీఈ/బీటెక్‌ అభ్యర్థులు ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్‌ , ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Entry into seven universities with a single exam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page