కడప జిల్లాల్లో దారుణం….

0 9

కడప ముచ్చట్లు :

 

: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో తల్లీ కూతుళ్లను గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే 2012లో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే వీరి హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కోసమే వీరి హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.అంజనమ్మ,లక్ష్మీ దేవిలు కోడలైన చరిష్మను వేధింపులు గురి చేస్తు హత్య చేశారు. చరీష్మా త‌ల్లిదండ్రులు అంజనమ్మ,లక్ష్మీ దేవి లపై కేసుపెట్టడంతో ఇటీవల బెయిల్‌పై ఇద్దరు బయటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో కోడలు చరిష్మా తరుపు కుటుంబ సభ్యులు, అంజనమ్మల మధ్య పంచాయితీ కొనసాగుతూ ఉంది. కూతురుని చంపిన ప్రతీకార చ‌ర్యలో భాగంగా చరిష్మా కుటుంబ సభ్యులు ఈ ఇద్దరిని హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు నిజాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. పోలీసులు విచారణ జరుగుతోంది.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Atrocities in Kadapa districts ….

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page