ఘనంగా  ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

0 7

కామారెడ్డి ముచ్చట్లు :

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మీటింగ్ హాలులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన  చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు చూడాలని పేర్కొన్నారు. సంతోషకరమైన తెలంగాణ  పురోగతిలో ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నదని కొనియాడారు. పరిపాలన ఒకే గొడుగు కింద అందాలనే  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆలోచనలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్  ధోత్రే, ఆర్టీవో వాణి, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Glorious Professor Jayashankar Jayanti Celebrations-District Collector Dr. Sarath

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page