ఘనంగా బిషప్ డానియల్ పాల్ జన్మదిన వేడుకలు

0 11

డోన్    ముచ్చట్లు :
ఘనంగా బిషప్ డానియల్ పాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, స్థానిక డోన్ పట్టణంలో
బిషప్ డానియల్ పాల్ జన్మదిన వేడుకలు స్థానిక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు రాయలసీమ యస్ జె సి ఫెలోషిప్ తరపున రెవ.పీ.శామ్యూల్  అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  30 మంది పాస్టర్లు కుటుంబాలతో కలిసి బిషప్ గారి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు పేరట ప్రత్యేక ప్రార్థనలు చేశారు… క్రమశిక్షణకు దేవుని ప్రేమకు మారుపేరుగా నిలుస్తూ, ఎన్నో వేల మంది క్రీస్తు సేవకులకు కు ఆదర్శప్రాయులు గా ఉన్న బిషప్ గారి ద్వారా తాను రాయలసీమ ప్రాంతానికి రా గలిగానని, అనేకమైన క్రీస్తు ప్రేమ పరిచర్య లను డోన్ పట్టణంలో చేయగలుగుటకు బిషప్ గారే గొప్ప దైవ ప్రేరణ అని రాయలసీమ యస్ జె సి ఫెలోషిప్ కన్వీనర్ రెవ. పీ. శామ్యూల్ తెలిపారు… అంతేకాకుండా సీనియర్ పాస్టర్ రాజ్ నిరీక్షన్ మాట్లాడుతూ బిషప్ గారి ద్వారా, వారి ప్రార్థన ల ద్వారా అనేకమంది సేవకులు అద్భుతమైన క్రీస్తు సేవా పరిచర్యలు జరిగిస్తున్నారని వారు ప్రత్యేకమైన అభిషేకం కలిగిన దైవజనులు గా తీర్చిదిద్ద బడ్డారని తెలియజేశారు… చిన్ననాటి నుండి బిషప్ గారి దగ్గర పెరిగిన పాస్టర్. ఎలీషా బెన్ని బిషప్. డానియల్ పాల్ గారు తమ ఆత్మీయ తండ్రి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని, ఇలాంటి  దైవజనుని పర్యవేక్షణలో నడుస్తున్న ఈ యస్ జె సి ఫెలోషిప ను బట్టి ఎంతో సంతోషంగా ఉందని సీనియర్  చార్లెస్ రావ్ గారు తెలిపారు. ప్రతి నెల అనేకమంది దైవ సేవకులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి కష్టసుఖాల్లో ఆపన్న హస్తాన్ని అందిస్తూ అనేక చర్చ్ ల నిర్మాణాలలో లో లో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న బిషప్ గారి సేవలను పలువురు సీనియర్ పాస్టర్స్ కొనియాడారు….. ఈ కార్యక్రమంలో రెవరెండ్. యం ఆనందరావు, పాస్టర్స్, తిమోతి పాల్, ఇమాన్యుల్ జోహార్, ఉదయ్ , అబ్రహం నాయుడు, మత్తయి, జీవన్,అమృత రాజ్l పాల్గొన్నారు…

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Proudly celebrating Bishop Daniel Paul’s birthday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page