చౌట‌కూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం

0 12

సంగారెడ్డి ముచ్చట్లు :

 

జిల్లాలోని పుల్క‌ల్ మండ‌లం చౌట‌కూర్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. లారీ-కారు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. మృతుల‌ను మెద‌క్ జిల్లా రంగంపేట వాసులు లూకా, దీవెన‌, ప‌ద్మ‌, దాసు, వివేక్ గుర్తించారు. అనారోగ్యానికి గురైన వివేక్‌కు సంగారెడ్డి ఆస్ప‌త్రిలో చికిత్స చేయించారు. చికిత్స అనంత‌రం స్వ‌స్థ‌లం రంగంపేట వెళ్తుండ‌గా కారు ప్ర‌మాదానికి గురైంది.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags; Ghora road accident at Chautankur .. Five persons were killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page