టీవీ 5 కార్యాలయంపై రాళ్ళ దాడి..యువకుడు అరెస్ట్

0 17

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు టీవీ5 కార్యాలయంపై రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో కార్యాలయ అద్దం దెబ్బతినడంతోపాటు ఓ వైద్యుడి కారు అద్దాలు పగిలిపోయాయి. కర్నూలు జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం పెద్దలపురానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డి (37) నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న టీవీ 5 కార్యాలయానికి చేరుకున్నాడు. కార్యాలయం అద్దాలపై రాయితో దాడిచేశాడు. అప్రమత్తమైన టీవీ 5 సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Stone attack on TV5 office..youth arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page