డోన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ

0 5

డోన్  ముచ్చట్లు :
డోన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ లు పంపిణీ చేశారు,స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం రోటరీ క్లబ్ అధ్యక్షులు జింకల కృష్ణా, కార్యదర్శి శేఖర్ యాదవ్ లు నిర్వహించిన ఈ కార్యక్రమనికి డోన్ డి యస్ పి శ్రీనివాస రెడ్డి, ఎం వి ఐ యస్ శివశంకర్,పట్టణ సి ఐ మల్లికార్జున, ముఖ్య అథితులు గా విచ్చేసారు, డోన్ రోటరీ క్లబ్ ఫౌండర్ రాజా విజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా 100 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ లను అందజేసారు,ఈ సందర్భంగా పట్టణ సి ఐ, మల్లికార్జున మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించ్చి,కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, యం వి ఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు, యూనిఫామ్ వేసుకుని, మాస్కు లేనిదే ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకుని వెళ్లరాదని చెప్పారు,అనంతరం  రోటరీ క్లబ్ అధ్యక్షులు జింకల కృష్ణ, కార్యదర్శి శేఖర్ యాదవ్ మరియు సబ్యులు పట్టణ సి ఐ మల్లికార్జున ,యం వి ఐ లకు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు
జగన్మోహన్, డిష్ రఫీ,మాకం కృష్ణకిశోర్, రాజయ్య గౌడ్, శంకర్ గౌడ్, సత్యసైనా రెడ్డి, గంగిరెడ్డి, యన్ నాగరాజు, చంద్ర శేఖర్ రెడ్డి, గౌండా శాలు, లక్ష్మీ రెడ్డి, మల్లారెడ్డి, లింగమయ్య, తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Distribution of uniforms to drivers under the auspices of the Don Rotary Club

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page