నల్గొండ కేంద్రంగా ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ

0 8

నల్గొండ ముచ్చట్లు :

 

పల్లె శివ ప్రవీణ్కుమా.. 1995 ఐపీఎస్ అధికారి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ గురుకులాల్లో మంచి పట్టు సాధించి ఎవ్వరు ఊహించని విధంగా రాజీనామా చేసి పతాక శీర్షికల్లోకి ఎక్కిన గురుకులాల మాజీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ జీవితంపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరట్లేదని బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటానికే పదవులకు రాజీనామా చేసినట్లు ఆరోజు వెల్లడించారు. అయితే.. ఇన్నాళ్లు ఆయన చెబుతున్న బహుజన వాదానికి అనుగుణంగానే ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే బీఎస్పీలో చేరతారని యూపికి చెందిన బహుజన సమాజ్వాదీ పార్టీ(BSP) చీఫ్ మాయవతి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందేదీంతో ఆయన రాజకీయ అరంగ్రేటానికి సన్నద్దమయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన గతంలో యూపీకి వెళ్లి మాయవతిని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముందస్తు వ్యుహంలో భాగంగానే ఆయన రాజీనామా సమర్పించారని సమాచారం. అయితే ఆయన చేరికపై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగంను రక్షించడం కోసం అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు.

 

 

 

 

- Advertisement -

RS ప్రవీణ్ కుమార్ ఈ నెల 8 తేదీన బహుజన సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అవుతున్నారని ప్రకటించారు. ఆయన చేరిక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందు కోసం నల్గొండలోని NG కాలేజ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. BSP జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ MP రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా తర్వాత ముందుగా TRSలో చేరతారని మీడియాలో.. సోషల్ మీడియాలో భారీ  ప్రచారం సాగింది. SCలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్‌లో ఆయన TRS పార్టీ నుండి పోటీచేస్తారనే విపరీతమైన ప్రచారం జరిగింది. మరోవైపు ఆయనే ఓ స్వంత పార్టీ పెడతారనే ప్రచారం కూడా వినిపించింది. అయితే వీటికి ఆయన ఎండ్ కార్డ్ వేశారు. తాను ముందుగా రాజకీయాల్లో రానన ప్రకటించిన ఆయన అనంతరం బడుగుల బలహీన వర్గాల అభివృద్ది కోసం ముందుకు వస్తానని ప్రకటించారు.తన విశాల దృక్పథం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు వస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు వల్ల ప్రయోజనం చేకూరదని విమర్శించారు. ఆ డబ్బులతో గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌లో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలతో ప్రయోజనం లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

 

 

 

మృతుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి
మూడు రోజుల కిందట ఎల్బీ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్‌లో మ్యాన్‌హోల్‌లో దిగి ఇద్దరు మున్సిపల్ కార్మికులు గల్లంతైన ఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ కార్మికులు మ్యాన్‌హోల్‌లో దిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. రాత్రివేళ కార్మికులు పారిశుధ్య పనులు చేయాల్సి రావడంపై ఆయన స్పందించారు. కార్మికులు మృతి చెందిన ఘటనలో జీహెచ్‌ఎంసీ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇలాంటి ఘటనల్లో పేదవారే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు.

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: Praveen’s political entry as Nalgonda center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page