నూతన విద్యా విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం

0 20

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీల‌క అంశాల‌పై నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పథకాల అమ‌లు, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించారు.ఈ నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చించారు. పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు విరిగిన అంశంపై కేబినెట్‌లో చర్చించారు.  20 నిముషాల పాటు స్టాప్ లాక్ గేటు, హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరిగింది.రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాడు-నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని మంత్రి పేర్నినాని అన్నారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని, మెరుగైన విద్య అందించాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్షని పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించాం.
కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే…

 

 

 

- Advertisement -

నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ ఖరారుi. శాటిలైట్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2)
ii. ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2)
iii. ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
iv. ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
v. హైస్కూల్స్‌ ( 3 నుంచి 10వ తరగతి వరకూ )
vi. హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)
విద్యార్థులకు ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు
ఏ తరగతికి అయినా తెలుగు తప్పనిసరిగా ఉంటుంది
రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదుల నిర్మాణం
నేతన్న నేస్తానికి 200 కోట్ల రూపాయలు కేటాయింపు
ఆగస్టు 10న 3వ విడుత నేతన్న నేస్తం
20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు ఈనెల 24న చెల్లింపులు
ఈ నెల 14న విద్యాకానుక పంపిణీ
అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు ఆమోదం
రాజమహేంద్రవరం అర్బర్ డెవలప్‌మెంట్ అథారటీ ఏర్పాటు
ఇకపై కాకినాడ డెవలప్‌మెంట్ అథారటీగా గోదావరి అర్బన్ డెవలప్ అథారటీ

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: AP Cabinet approves new education policy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page