పదో తరగతి ఫలితాలు విడుదల

0 11

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు ఈరోజు సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించి సిఫారసులు చేసిందన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజించినట్టు చెప్పారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం వాటిల్లదన్నారు. కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని మంత్రి వివరించారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags: Tenth grade results released

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page