మొక్కలు నాటితేనే భావితరాలకు ప్రాణవాయువు:ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

0 17

గోనెగండ్ల ముచ్చట్లు :

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండల పరిధిలోని పుట్టపశం గ్రామంలో ఉపాధి హామీ (NREGS) శాఖ ఆద్వర్యంలో ఆకుపచ్చని ఆంధ్రావని మన లక్ష్యం – “జగనన్న పచ్చ తోరణం” 72వ వనమహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి  హాజరయ్యారు. మొదటగా మొక్కలను నాటి నీళ్ళు పోశారు. అందులో భాగంగా మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా కారణంగా మానవాళికి ఆక్సిజన్ ఎంత అత్యవసరం అయిందో తెలిసిందన్నారు. రాబోయే రోజుల్లో మొక్కలు పెంచకపోతే భావితరాల మానవాళికి ముప్పు తప్పదన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న గారు పచ్చతోరణం పథకాన్ని శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నారన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని పరి రక్షించు కోవాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో ఏపీఓ బోజ్జన్న గారు, ఇసీ ఉస్మాన్ సాబ్ గారు,  గ్రామ సర్పంచ్ నరస్మింహ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ గారు, బాస్కర్ రెడ్డి, గోవింద్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు సయ్యద్ చాంద్‌‌, వడ్డె రంగన్న తదితరులు పాల్గొన్నారు..

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Planting plants is the lifeblood of the future: Red Fort Jaganmohan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page