విశాఖ సాగర్ తీరంలో వెంకన్న కొలువు

0 9

విశాఖపట్నం ముచ్చట్లు:
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఇక విశాఖ సాగరతీరంలో కొలువు దీరబోతున్నాడు.రిషికొండల్లో ఒకటైన పర్యతంపై సర్వాంగ సుందరంగా నిర్మా ణమైన ఆలయ ప్రాకారం ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. టీటీడీ దేవాలయం కోసం 10 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. 10 ఎకరాల్లో ఏర్పాటుచే సిన దేవాలయంలో ఈ నెల 11న దేవదేవుని విగ్రహ ప్రతిష్ట జరగనుంది. 8న అంకురార్పణ, 13న సంప్రోక్షణ జరగనుంది. ఇక ఆ తర్వాత 13న మధ్యాహ్నం నుంచి భక్తులకు దేవ దేవుని దర్శనం లభించనుంది. 28కోట్ల రూపాయల వ్యయంతో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని.. తిరుమల ఆలయ నమూనాలో తీర్చిదిద్దింది టీటీడీ.ఒకవైపు సముద్రం.. మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టు కుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు.. సాగం తీరం మరింత ప్రియం కానుంది.తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీవారికి పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహించనున్నారు.తిరుమల వెంక న్న విశాఖలోనే దర్శనం ఇచ్చే ఆధ్యా త్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఆలయం డ్రోన్ వీడియోలు భక్తులను తన్మయ పరుస్తున్నాయి.

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Venkanna Koluvu on the coast of Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page