వైసీపీ వర్సెస్ టీడీపీ

0 9

గుంటూరు  ముచ్చట్లు:
అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా… ఒక్కసారిగా 2018 సార్వత్రిక ఎన్నికల్లో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీ వాళ్లు ఎక్కడ ఎలాంటి తప్పులు చేస్తారా? ఎలా ఆడుకోవాలా? అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉండడం విశేషం.2018 కి ముందు కూడా టీడీపీ, వైసీపీల మధ్య చాలా గొడవలు జరిగాయి. చాలా మంది వైసీపీ మద్దతుదారులను సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ పోలీసులు అరెస్టులు చేశారు. ప్రస్తుతం వైసీపీ వాళ్ల టైం వచ్చింది కాబట్టి టీడీపీ నాయకుల మీద కసి తీర్చుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అటువంటిదేం లేదని కేవలం రాష్ర్ట అభివృద్ధి కొరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి తాపత్రయ పడుతున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.తాజాగా వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారుతోంది. సదరు కార్యకర్త కేరళలోని ఇంటి బొమ్మను తీసుకువచ్చి ఏపీలో వైసీపీ ప్రభుత్వం కట్టిస్తోందని చెప్పడంతో జగడం స్టార్ట్ అయింది. ఏపీలోని జగనన్న ఇళ్లు అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండి పడుతున్నారు. అబద్దపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అబద్దాలు మాని రాష్ర్ట అభివృద్ధి పై కాన్సంట్రేట్ చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది.

 

ఘనంగా పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ జన్మదిన వేడుకలు – మంత్రి పెద్దిరెడ్డి, ఎంపిలు మిధున్‌, రెడ్డెప్ప శుబాకాంక్షలు

- Advertisement -

Tags:YCP vs TDP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page