స్వచ్చ భారత్ పై లఘు చిత్ర పోటీ..

0 16

జగిత్యాల    ముచ్చట్లు :

స్వచ్ఛత ఫిల్మోన్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జాతీయ లఘు చిత్రాల పోటీలు నిర్బహిస్తుండగా, ఇందులో పాల్గొనే వారు ఈ నెల 15 లోగా లఘు చిత్ర వీడియోలను పంపించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ త్రాగునీటి పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో తడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, గోబర్దాన్, మల బురద నిర్వహణ, స్వచ్ఛ భారత కోసం గ్రామంలో ప్రవర్తన మార్పు అంశాలపై 5 నిమిషాల లఘు చిత్రాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రాలలో పోటీ చేయడానికి 10 సంవత్సరాల పై బడిన భారత పౌరులు అర్హులని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నీరు, పారిశుధ్య శాఖలలో పనిచేస్తున్నవారు, భారత పౌరులు ఎవరైనను ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. పైన తెలిపిన అంశాలకు సంబంధించిన లఘు చిత్రాలు ఒకటి నుంచి ఐదు నిమిషాలలోపు నిడివి కలిగి ఉండాలని తెలిపారు. ఈ పోటీలలో ఉత్తమ చిత్రాలుగా ఎంపిక అయిన వాటికీ మొదటి బహుమతి ఒక లక్ష 60 వేల రూపాయలు, మొదటి రన్నర్ కు 60 వేల రూపాయలు, రెండవ రన్నర్ కు 30 వేల రూపాయలు అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. లఘు చిత్రాలను ఈ నెల 15 లోగా పంపించాల్సి ఉంటుందని, మరింత సమాచారం కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్వచ్ఛ భారత్ విభాగం జగిత్యాల సెల్ నంబర్ 9121221899 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Short Film Competition on Swachh Bharat ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page