19 ఏళ్ల యువతితో 67 ఏళ్ల వృద్ధుడి లవ్ స్టోరీ

0 29

ఛండీఘడ్   ముచ్చట్లు :
హర్యానా రాష్ట్రంలో విచిత్ర ఘటన జరిగింది. 67 ఏళ్ల ఓ వృద్ధుడు, 19 ఏళ్ల యువతి కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తాము ఫిర్యాదు చేయడానికి వచ్చామని, తామిద్దరికి రక్షణ కల్పించాలని కోరారు. అతడి మనవరాలిని ఎవరో వేధించి ఉంటారని, కేసు పెట్టడానికి వచ్చి ఉంటాడని పోలీసులు భావించారు. తీరా అసలు సంగతి చెప్పాక పోలీసులు అవాక్కయ్యారు. ‘మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా కుటుంబాలకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వారి నుంచి మాకు రక్షణ కల్పించండి’ అని ఆ జంట పోలీసులను కోరింది. చివరకు వీళ్లిద్దరూ రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.హర్యానాలోని హతిన్ నగర పరిధిలోని హంచ్‌పురీ గ్రామానికి చెందిన వృద్ధుడి(67)కి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. అతడి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. నూహ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) కుటుంబానికి ఆ గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి. ఆ కుటుంబవారితో అతడికి పరిచయం ఉండటంతో భూతగాదాను తాను పరిష్కరిస్తానని ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతితో చనువు పెరిగింది. ఆమెకు అంతకుముందే వివాహం కాగా భర్తతో గొడవల కారణంగా పుట్టింట్లో ఉంటోంది.అయితే ఆ ముసలోడు ఏం మాయమాటలు చెప్పాడో తెలీదు గానీ ఆ యువతి మాత్రం అతడితో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కలిసి రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. దీంతో ఆ వృద్ధుడు, యువతి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి వ్యవహారంపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఇద్దరినీ వేర్వేరు చోట్ల ఉంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది.దీంతో పాటు ఆ వృద్ధుడి వ్యవహారం గురించి, గతంలో అతడి ప్రవర్తన గురించి కూడా ఆరా తీయాలని పల్వాల్ జిల్లా ఎస్పీ దీపక్ గెహ్లావత్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ యువతి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరై స్టేట్‌మెంట్‌ను ఇవ్వాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. యువతి ఏ పరిస్థితుల్లో అతడితో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది, ఆమె మానసిక స్థితి ఎలా ఉంది, ఇష్టపడే పెళ్లిచేసుకుందా? లేక బెదిరించారా? అన్న కోణంలో సమగ్ర విచారణ చేపట్టి పదో తారీఖులోపు రిపోర్టును ఇవ్వాలని ఆదేశించింది.

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Love story of a 67 year old man with a 19 year old girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page