2 లక్షలకు కూతురును అమ్మేసిన తండ్రి

0 22

మహబూబ్ నగర్ ముచ్చట్లు :
కుమార్తె అనారోగ్యానికి గురై మృతి చెందితే పదిరోజుల పాటు తీవ్ర మనో వేదనకు గురైన తల్లిదండ్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేటిపిఎస్ పంప్ హౌస్ దగ్గర గోదావరిలో దూకి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడితే, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామంలో మద్యానికి బానిసైన ఒక తండ్రి డబ్బుకోసం నెలన్నర వయసున్న తన కొడుకుని రెండు లక్షలకు అమ్మేసిన ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామం చోటుచేసుకుంది.మద్యం మత్తు.. మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చేస్తుంది. మద్యానికి బానిసలైతే జీవితాలే కాదు.. కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయని అంటారు. మద్యం మత్తులోనే ఎన్నో నేరాలు ఘోరాలు జరిగిపోతుంటాయి. అంతలా మనిషిపై ప్రభావం చూపుతుందీ మద్యం. అనేక మంది పశువుల్లా మారడానికి కూడా ఈ మద్యమే కారణం.మద్యానికి బానిసైన ఓ తండ్రి.. సొంత కొడుకునే అమ్మకానికి పెట్టాడు. మధ్యవర్తుల సహాయంతో పిల్లాడిని అమ్మేశాడు. అయితే, పిల్లాడు.. చేతులు మారే సమయంలోనే సీన్ రివర్స్ అయ్యింది. సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మద్యం బానిస తండ్రి బాగోతం బయటపడిందినాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామం చెంచుగూడానికి చెందిన బయ్యన్న మద్యానికి డబ్బుల్లేక.. నెలన్నర వయసున్న కొడుకును అమ్మేశాడు. రెండు లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని లక్షా యాభై వేలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. అయితే, బాలుడిని అప్పగించేందుకు వెళ్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది.స్పాట్ కు చేరుకున్న పోలీసులు శిశువును స్వాధీనం చేసుకుని తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలుడిని తిరిగి తల్లికి అప్పంచారు. అయితే, ఇక్కడ బాధాకరమైన సంగతి ఏమిటంటే.. బిడ్డ తల్లి మూగ కావడంతో.. కనీసం తన బాధను వ్యక్తం చేయలేక.. ఎవరికీ.. ఏమీ చెప్పుకోలేక బేల చూపులు చూస్తుండటం అందర్నీ కలచివేసింది..

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:A father who sold his daughter for Rs 2 lakh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page