8న చలో నల్గొండ.. బహుజన గర్జనను విజయవంతం చేద్దాం

0 12

బహుజనుల బలోపేతానికే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేరిక
స్వేరో అనుబంధ సంఘాల కోఆర్డినేటర్ నక్క విజయ్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు :
బహుజనుల రాజ్యాధికారంకే లక్ష్యంగా ఈ నెల 8న నల్గొండలో బహుజన గర్జన బహిరంగ
సభను నిర్వహిస్తున్నారని, బహుజనుల బలోపేతమే లక్ష్యంగా తన ఉద్యోగాన్నే వదిలి మాజీ పోలీసు అధికారి
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో  చేరుతున్నారని ఈ సభకు విజయవంతం చేయడానికి బహుజనులందరు
బారీగా తరలిరావాలని స్వేరో అనుబంద సంఘాల కోఅర్డినేటర్ నక్క విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. శుక్రవారం
జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడారు. బహుజనులైన బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేదల సంఖ్య దేశంలో ఎక్కువగా ఉన్నా ఇప్పటికి రాజ్యాధికారం దక్కలేదన్నారు. 75
సంవత్సరాలుగా పేదలకు అందాల్సిన విధ్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందడం లేదన్నారు. ప్రభుత్వ కొలువులో ఉండి బహుజనులు పడుతున్న వేతనలను అర్థం చేసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అరున్నర ఎండ్ల ప్రభుత్వ
సర్వీస్ ఉండగానే తన ఉద్యోగాన్ని త్రుణప్రాయంగా వదిలేసి బడుగు, బలహీనవర్గాల, పేద ప్రజల కోసం అడిషనల్ డిజిపి స్థాయి హెదా
వస్తుందన్నా పట్టించుకోకుండా ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేశారన్నారు. ఆయన
త్యాగం మనందరం గుర్తుంచుకోవాలని ఆయన వెన్నంటి మనందరం నడవాలని రానున్న రోజుల్లో బడుగు ,బలహీన వర్గాల ప్రజలే రాజులు, పాలకులు ఆవుతారనే సందేశాన్ని ప్రవీణ్ కుమార్ సారు పంపించారని ఇక ఎవరిని అడుక్కోవాల్సిన
అవసరం లేదని విజయ్ కుమార్ తెలిపారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పాలేర్ల బతుకులన మార్చుకోవాలని పెన్షన్లు, పది లక్షల పథకాలకు పరిమిమవకుండా అధికారమే లక్ష్యంగా అత్యధికులైన 93 శాతం ప్రజలందరు ఒక్కటై
ముందుకు సాగుదామని, మన పిల్లల భవిష్యత్తును అలోచించి ముందుకు సాగాలని విజయ్ కుమార్ అన్నారు. రాబోయే రోజులు అన్ని బహుజనులవేనని ఈ నెల 8న నల్గొండలో జరిగి బహుజనుల గర్జన సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో తరిలిరావాలని విజయ్ కుమార్ కోరారు. ఆనంతరం బాం సేఫ్ జిల్లా కన్వీనర్ కాయితి శంకర్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు లాజరస్, టిజిపిఏ జిల్లా అధ్యక్షులు బండ్ర శ్రీనివాస్, ఫిట్ ఇండియా ఫౌండేషన్
జిల్లా కార్యదర్శి మెడపట్ల రాజేష్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు నాతర్ల శ్రీనివాస్, న్యాయవాది గుడికందుల మహేష్ తోపాటు పలువురు మాట్లాడారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Chalo Nalgonda on the 8th .. Let’s make the mass roar a success

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page