అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతీ

0 9

కడప ముచ్చట్లు :

 

మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారి డి. అగ్రహారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపకి వివాహానికి వస్తున్నారు. మరోవైపు చిత్తూరు నుంచి టమాటా లోడుతో మినీ లారీ వెళుతోంది. డి.అగ్రహారం వద్ద స్పీడ్‌ బ్రేకర్ల కారణంగా ఇన్నోవా, లారీ ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను, మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags; Midnight horrific road accident: Four dead

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page