ఆడుకుంటున్న చిన్నారులపై కారు

0 11

మెదక్  ముచ్చట్లు:
రిగ్గా సాయంత్రం 7 గంటలు అవుతోంది. కాలనీలోని పిల్లలందరూ గుమిగూడారు. అందరూ ఒక్కచోటకు చేరి సరదాగా ఆడుకుంటున్నారు. ఓ పిల్లాడు సైకిల్ తొక్కుతుండగా.. మరికొందరు పిల్లలు సరదాగా ముచ్చటిస్తూ ఆడుకుంటున్నారు. అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. ఊహించని రీతిలో ప్రమాదం వారిని వెంటాడింది. భీతిగొలిపే విధంగా ఓ కొత్త కారు పిల్లలపై దూసుకువచ్చింది. భారీ శబ్దాలతో కారు దూసుకురావడంతో అలర్ట్ అయిన పిల్లలు.. భయంతో అక్కడి నుంచి తలోదిక్కు పారిపోయారు. చిన్నారులు ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది.ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. సాయినగర్ కాలనీలో నిన్న రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. నూతనంగా కొనుగోలు చేసిన కారును డ్రైవర్ అతి వేగంగా నడిపాడు. దాంతో అదికాస్తా అదుపు తప్పి కాలనీలో గోడలను గుద్దుకుంటూ అక్కడే ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకువచ్చింది. చిన్నారులు పక్కకు జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఒక బైక్ మాత్రం ధ్వంసమైంది. కాగా, ఈ ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో అదికాస్తా వైరల్‌గా మారింది.

 

సింధూకు జగన్ సత్కారం

- Advertisement -

Tags:Car on children playing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page