కాంగ్రెస్ నేతల మాటల యుద్దం

0 5

ఇంద్రవెల్లి  ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని దళిత ఆదివాసీ దండోరా కార్యక్రమం పనులను  కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు,  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజీద్ ఖాన్,  ఇటివలే కాంగ్రెస్ లో చేరిన ఆదివాసీ ఉద్యమ నాయకుడు వెడ్మ బొజ్జు, ఉట్నూర్ జడ్పిటిసి చారులత తదితరులు పాల్గోన్నారు.ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వెనుకాల సభ స్థలాన్ని పరిశీలించి నాయకులు సమావేశం నిర్వహించగా  ఉట్నూర్ జడ్పిటిసి చారులత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు భారత్  చౌహాన్ మద్య మాటల యుద్దం జరిగింది. ఖానాపూర్ నియోజకవర్గానికి ఎవరు ఇంచార్జి అంటు మాటల యుద్దం మొదలెట్టారు. భారత్ చౌహన్ ఇంచార్జి కాదని.. జడ్పిటిసి చారులత వాదించగా… భారత్ చౌహాన్  నువ్వు జడ్పి చైర్మెన్ ఎన్నికలో 2 కోట్లు తీసుకోని టిఆర్ఎస్ పార్టీ కి చేయి ఎత్తి టిఆర్ఎస్ వర్గానికి సపోర్టు చేశావు అంటు వాదించారు.  దమ్ముంటే నిరుపించు ఎక్కడ ఎలా తీసుకున్నానో అంటు చారులత సవాలు విసిరారు.  ఇరువురిని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావ్ సముదాయించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరు కలిసి కట్టుగా పనిచేయాలని ఇలా గ్రూపు విబేదాలు చెయొద్దని.. అందరు కలిసి  దళిత ఆదివాసీ దండోర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని బుజ్జగించారు. దీంతో ఇరువురు కూడా సైలెంట్ అయ్యారు…

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:War of words by Congress leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page