కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా హర్షకుమార్

0 20

విజయవాడ   ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఆశలు లేవు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైసిపి ఖాతాలో పడిపోయేలా చేశారు జగన్ మోహన్ రెడ్డి. దాంతో పాటు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి ఎపి వాసులకు తీరని ద్రోహం కాంగ్రెస్ చేసిందనే మాట చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పొచ్చు. అలా అని కాంగ్రెస్ చేసిన గాయం బిజెపి చెరిపే పని చేసిందా అంటే గత ఏడేళ్ళు గా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. అయితే గతకొంతకాలం క్రితం బిజెపి దూకుడు గా వెళ్ళే సోము వీర్రాజు ను అధ్యక్షుడిగా చేసి ఏదైనా అవాకాశం చిక్కక పోతుందా అని ఎదురుచూస్తుంది. మరోపక్క కాంగ్రెస్ రఘువీరా రెడ్డి స్థానంలో దళిత సామాజికవర్గానికి చెందిన సాకే శైలజానాధ్ కి పగ్గాలు అప్పగించి చూసింది. కానీ ఆయన వల్ల కూడా పార్టీకి ఎలాంటి ఊపు హస్తానికి కనిపించడం లేదు.ఇటీవల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసే ఆలోచన సాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఎపి కి కూడా నిత్యం ప్రజల్లో ఉండే చురుకైన నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈ వేట లో అమలాపురం మాజీ ఎంపి జివి హర్ష కుమార్ సరైన వ్యక్తిగా కాంగ్రెస్ అధిష్టానానికి సమాచారం చేరినట్లు తెలుస్తుంది. విభజన తరువాత పార్టీనుంచి బహిష్కరించబడి ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెంది హర్షకుమార్ దానినుంచి బయటకు వచ్చి టిడిపి లో చేరి ఆ వెంటనే వెనక్కి వచ్చి కొంత కాలం మౌనం వహించారు.అయితే వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కేసులకు సైతం వెరవకుండా వ్యతిరేక పోరాటం చేస్తూనే వచ్చారు. తమ సహచరులు, సన్నిహితుల వత్తిడితో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న హర్ష కుమార్ ప్రజల్లో పార్టీకి మైలేజ్ లేకపోయినా ఎదో ఒక ఉద్యమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎపి లో దళితుల సమస్యలు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రత్యక్షం అయి ఉద్యమ బాటలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి తమ పార్టీకి తెచ్చే ప్రయత్నం కోసం శ్రమిస్తున్నారు. దాంతో హర్షకు పిసిసి కీరిటం పెడితే జగన్ పార్టీకి ఇబ్బందులు సృష్ట్టించడంతో బాటు కోస్తాలో బలమైన ఎస్సి సామాజికవర్గాన్ని కాంగ్రెస్ కు దగ్గర చేయగలరని అధిష్టానం యోచన చేస్తున్నట్లు టాక్. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది…

 

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

- Advertisement -

Tags:Harshakumar as Congress President

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page