కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రఘురామి రెడ్డి

0 6

తుగ్గలి  ముచ్చట్లు:

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ వారు పెద్ద ఎత్తున కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.శనివారం రోజున మండల పరిధిలోని పెండేకల్ సబ్ సెంటర్ నందు వైద్య శాఖ అధికారులు గర్భవతులకు నిర్వహిస్తున్న కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రఘురామి రెడ్డి పరిశీలించారు.అదేవిధంగా మండల కేంద్రమైన తుగ్గలిలో గల ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ను పరిశీలించి,వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్,ఏఎన్ఎం లు, అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు మరియు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Deputy DM and HO Raghurami Reddy inspecting the Kovid Mega Vaccination Program

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page