కోవిడ్_19 దృష్ట ప్రభుత్వ నిబంధనల మేరకు దర్శన వేళలు మార్పులు

0 10

భక్తులు అందరూ సహకరించాలని ఆలయం ఈవో వాణి
అసంఘటిత చర్యలు జరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం
ఎస్ ఐ మన్మధ విజయ్

కౌతాళం ముచ్చట్లు:

 

 

- Advertisement -

మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలను అందరు సహకరించి జయప్రదం చేయాలని ఈ ఓ వాణి, ఎస్ ఐ మన్మధ విజయ్ తెలిపారు. కోవిడ్ ఉన్నందున  భక్తా దులకు స్వామివారి దర్శనానికి మార్పులు చేయడం జరిగినది విలేకరుల సమావేశంలో ఆలయం ఈవో వాణి గారు మండల ఎస్సై మన్మధ విజయ్ పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా దేవాలయమునకు శ్రీ స్వామివారి దర్శనమునకు విచ్చేయు ప్రతి భక్తుడికి తెలియజేయడమేమనగా కోవిడ్_19 దృష్ట ప్రభుత్వ నిబంధనల మేరకు దర్శనం కు వచ్చే భక్తులకు సూచనలు
65 సంవత్సరాలు పైబడినవారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల లోపు పిల్లలు దర్శనానికి అనుమతించబడదని, ఆలయం ప్రవేశం చేయు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్కులు ధరించి  ఒకేచోట సమూహముగా ఉండకూడదని  భక్తులు ఎవరు కూడా ఎల్. ఎల్. సి. కాలువలో స్నానం చేయరాదని దుకాణాలు క్యాంటీన్లు వంటివి దేవాలయ ఆవరణ బయట ఏర్పాటు చేయవలెనని  అట్టి దుకాణాల వద్ద కూడా భక్తులు దూరం పాటించవలెనని భక్తులకు తీర్థ ప్రసాదములు వితరణ శాటరి పవిత్ర జలం చల్లుట వంటివి ప్రస్తుతం నిలుపుదల చేయడమైనది గర్భాలయ దర్శనాలు నిలిపివేయడం జరిగినది గదులు అద్దెకు ఇవ్వబడువు  అని దేవస్థాన పరిసర ప్రాంతాలలో రాత్రి సమయంలో నిద్ర చేయడానికి వీలు లేదని  దేవాలయం ప్రవేశం నుండి  దర్శనం ప్రసాదం కౌంటర్ అన్నదానం క్యూలైన్లో భౌతిక దూరం కనీసం 6 అడుగులు పాటించవలెనని దేవాలయం ప్రాంగణంలో భక్తులు కూర్చునే ప్రదేశములలో కూడా భౌతిక దూరం పాటించవలెనని ఆలయ ప్రాంగణంలో, దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉండకూడదని కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సామూహిక ప్రార్థనలు భోజనాలు చేయరాదని సూచించారు. ముఖ్యంగా భక్తులకు తెలియజేయడమేమనగా కరోన  థర్డ్ వే కొన్ని ప్రాంతాలలో వచ్చి నందున  శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానము నందు కూడా రాత్రి పూట కర్ఫ్యూ  అమల్లో ఉంటుంది అందరూ తెలుసుకోవాలని సూచించారు. దర్శన వేళలు  ఉదయం 7;;; గంటల నుంచి రాత్రి 7.. గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుందని అనంతరం రాత్రివేళ దర్శనం నిలిపి వేయబడుతుందని భక్తాదులు కూడా ప్రతి ఒక్కరు రాత్రిపూట బస చేయడానికి వీలు లేదని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అందరూ ఈ సూచనలను సహకరిస్తారని తెలియజేశారు. తప్పకుండా ఈ సూచనలు పాటించండి వచ్చే సంవత్సరం శ్రావణమాసం ఇంకా ఘనంగా జరుపుకుందమని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆలయం సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఆలయ అధికారులు పూజారులు తదితరులు పాల్గొన్నారు.

 

సింధూకు జగన్ సత్కారం

Tags:Kovid_19 Visitation hours are subject to change as per government regulations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page