గర్బిణీ మృతి…బంధువుల అందోళన

0 9

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

 

పాల్వంచ మండలంలోని పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన పూనం కమల (26) గర్భిణీ మృతి చెందింది. దాంతో  పాల్వంచ  ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబ సభ్యులు,బందువులు ఆందోళన చేపట్టారు.  అనారోగ్యం కారణంగా గత మూడు రోజుల క్రితం  పూనం కమలను పాల్వంచలోని శ్రీ రక్షా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.అక్కడి వైద్యులు ఆమెను పరిశీలించి పురిటి నొప్పులు వస్తున్నాయి, ఆపరేషన్ చేయాలని తెలియజేశారు.దీంతో ఆపరేషన్ ఖర్చు భరించే శక్తి లేక కుటుంబ సభ్యులు ఆమెను  పాల్వంచ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రభుత్వ ఆస్పత్రిలో  వైద్యులు కమలకు ఐదు బాటిల్స్ రక్తం ఎక్కించాలని సూచిం చారు.దీంతో పేషెంట్ బంధుమిత్రులు రక్తం ఏర్పాటు చేశారు.ఇదంతా జరిగి న క్రమంలో వైద్యులు ఈమెను మెరు గైన వైద్యం కోసం తక్షణమే కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లాలని తెలిపారు.గత్యంతరంలేక కమలను కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్ళారు. అక్కడ వైద్యులు డెలివరీ చేసి  బిడ్డ చనిపోయింది , తల్లి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే వరంగల్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని కుటుం బ సభ్యులకు తెలిపారు.వారు ఆమెను అక్కడ నుంచి వరంగల్ కు తరలించా రు.అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుం డగా ఆమె మరణించింది.దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురైనారు. పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంత దారుణం జరిగిందని మృతురాలి బంధువులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
పాల్వంచ పట్టణ ఎస్.ఐ.ప్రవీణ్ కుమార్ ఈ సంఘటన పై స్పందించి విచారణ చేపట్టారు.

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags: Concern of relatives of pregnant woman dead

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page