తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి

0 86

చౌడేపల్లె ముచ్చటు:

 

ప్రతీమహిళ తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఐసీడిఎస్‌ ఏసీడిపిఓ సరళాదేవి సూచించారు. శనివారం మండలంలోని గోసలకురప్పల్లె అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి ముర్రుపాలు పట్టించడం వలన వ్యాధి నిరోదకశక్తి ఉంటుందన్నారు.వెహోదటి ఆరు నెలలపాటు బిడ్డకు తల్లిపాలను మాత్రమే తాగించాలన్నారు. పోతపాలు, చక్కెరనీళ్లు, తేనె లాంటివి పట్టించడం ద్వారా బిడ్డ అనారోగ్యం భారీనపడే అవకాశం ఉందన్నారు.తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని అవగాహన కల్పించారు.చిన్నపిల్లలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అలాగే అంగన్‌వాడీకేంద్రాల ద్వారా పంపిణీ చేసే పౌష్టిక ఆహారంను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.దిశ యాఫ్‌ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ మాధవీలత , మహిళా పోలీసు సుభాషిణి, కార్యకర్తలు భాగ్యమ్మ, పూర్ణమ్మ తదితరులున్నారు.

 

- Advertisement -

 సింధూకు జగన్ సత్కారం

Tags: Be aware of the importance of breastfeeding

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page