పంటపోలాలను తొలగించిన అధికారులు

0 5

ప్రభుత్వ భూమిలో పంటలు వేసిన రైతులు
అనంతపురం  ముచ్చట్లు:

 

 

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురం – కొప్పలకొండ గ్రామాల్లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో రైతులు సాగు చేసిన పంటలను అధికారులు  తొలగించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కేసవపురం- కోప్పలకొండ గ్రామాల సమీపంలో ఉన్న పెన్నానది పరీవాహక ప్రాంతమైన సర్వే నెంబర్ 616 లో 351.71 ఎకరాలు, 676-1 సర్వే నెంబర్ లో 364.40 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అయితే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పంటలు సాగు చేస్తున్నారని, వెంటనే పంటలు తొలగించుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులు  రైతులకు నోటీసులు ఇచ్చారు. అయితే లక్షలు పెట్టి సాగు చేసుకోవడం వల్ల పంటలను రైతులు తొలగించుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు, పోలీసు సిబ్బంది సహకారంతో జెసిబిలతో పంటలను తొలగించారు. పంటలు తొలగించవద్దని రైతులు అధికారుల కాళ్ళ, వెళ్ళా పడ్డా  కనుకరించలేదు. . దీంతో కళ్ళ ముందు కొడుకులా సాగు చేసుకున్న పంటలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నా చేసేది లేక కన్నీటి పర్యంతం అయ్యారు. పంటలతో పాటు పైపులు, డ్రిప్ పరికరాలు ధ్వంసం అయ్యాయని రైతులు వాపోయారు. ఆఖరికి మీడియాను కూడా ఘటన స్థలానికి అనుమతించలేదు.. అనంతపురం డీఎస్పీ రాఘవ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.

- Advertisement -

పుంగనూరులో శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Officers clearing crops

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page