పుంగనూరులో డ్రమ్ము పద్దతి ద్వారా వరి పంటను నాటాలి-ఏడి లక్ష్మా నాయక్

0 42

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

రైతులు డ్రమ్ము పద్దతి ద్వారా వరి పంటలను పండించే విధానాన్ని అలవర్చుకోవాలని ఏడి లక్ష్మా నాయక్ సూచించారు. శనివారం మండలంలోని కల్లుపల్లె గ్రామంలో రైతు శిక్షణా కార్యక్రమాన్ని ఏవో సంధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి , రైతులు కలసి హరి అనే రైతు డ్రమ్ము పద్దతి ద్వారా నాటిన వరి పంటను పరిశీలించారు. ఏడి మాట్లాడుతూ నారుమడి లేకుండ రైతులు నేరుగా విత్తనాలను ఒకరోజు మండగట్టి డ్రమ్ము పద్దతి ద్వారా నాటాలన్నారు. ఈ విధంగా నాటడం వలన ఖర్చు తగ్గడంతో పాటు వరి పంటకు గాలి , వెలుతురు పుష్కలంగా లభించి, అధిక దిగుబడులు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భాగ్యమ్మ, వ్యవసాయ కమిటి సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, మునివెంకట్రమణ, ఏఈవో జయంతి తదితరులు పాల్గొన్నారు.

సింధూకు జగన్ సత్కారం

Tags: Natali-adi lakaonayak ను paddy crop by drum method in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page